vumdedevaru poyedevaru ugisalatalo
ఇదే చివరి దినమైతే - ఎటు వైపో నీ ప్రయాణం...
అదే పాత బ్రతుకైతే - రక్షణ పొందిన వ్యర్థం.
పల్లవి:-
వుండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో...
మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో ll2ll
జీవము దిగివచ్చింది - ప్రభు యేసుని రూపంలో
అవకాశము మనకొచ్చింది - పరలోకము చేరుటకూ
చరణం:-1
ఏది నీది ఏది నాది ఏది మనదయ్యా
ఉన్నవి అన్నీ పోయేవేనని చెప్పెను యేసయ్యా ll2ll
చేప నోటిలో షెకెలు ఉందని తెలిసిన ఆయనకు
సృష్టిలో బహుసంపద ఉందని తెలియదా యేసునకు ll2ll
సిరికి దేవునికి... దాసులుగా ఉండలేమని
నాకు నేర్పించాలని... తాను కొదువ కలిగి జీవించాడు
ll ఇదే ll
చరణం:-2
తల్లిని విడిచిన జీవరాశులు తిరిగి రావయ్యా
రెక్కలు వచ్చి ఎగిరి పోతే గతమే గుర్తుకు రాదయ్యా ll2ll
నిన్ను విడిచిన నీ పిల్లలు నిన్ను చూడగ వస్తారు
దూరము భారము అనుకోకుండా నిన్ను చూసి వెళవెళతారు >
నీ తండ్రిని చూచుటకు... పరలోకం చేరుటకు
తప్పిపోయిన కుమారుడా... తప్పు దిద్దుకొని రావయ్యా...
ll ఇదే ll
చరణం:-3
క్రీస్తు వచ్చే వేళ అయినది సిద్దపడవయ్యా
ఆత్మీయమైన యాత్రలో బాటసారివి నీవయ్యా ll 2 ll
నీ దుఖఃదినములను ఆనందముగా మార్చే దేవునితో
రాత్రి లేని లోకములో నిత్యము యేసుని వెలుగులో ll 2 ll
సంచరించుటకూ... నువు సంతోషించుటకూ
నూతనముగా జన్మించి నీతి వస్త్రమును ధరించుము...
ll ఇదే ll
Ide chivari dinamaite - ètu vaipo ni prayanam...
ade pata bratukaite - rakshana pòmdina vyartham.
pallavi:-
vumdedèvaru poyedèvaru ugisalatalo...
maranamu tèchchukunnamu kada edenu totalo ll2ll
jivamu digivachchimdi - prabhu yesuni rupamlo
avakashamu manakòchchimdi - paralokamu cherutaku
charanam:-1
edi nidi edi nadi edi manadayya
unnavi anni poyevenani chèppènu yesayya ll2ll
chepa notilo shèkèlu umdani tèlisina ayanaku
srrishtilo bahusampada umdani tèliyada yesunaku ll2ll
siriki devuniki... dasuluga umdalemani
naku nerpimchalani... tanu kòduva kaligi jivimchadu ll ide ll
charanam:-2
tallini vidichina jivarashulu tirigi ravayya
rèkkalu vachchi ègiri pote gatame gurtuku radayya ll2ll
ninnu vidichina ni pillalu ninnu chudaga vastaru
duramu bharamu anukokumda ninnu chusi vèlataru ll2ll
ni tamdrini chuchutaku... paralokam cherutaku
tappipoyina kumaruda... tappu diddukòni ravayya... ll ide ll
charanam:-3
kristu vachche vela ayinadi siddapadavayya
atmiyamaina yatralo batasarivi nivayya ll 2 ll
ni dukhahdinamulanu anamdamuga marche devunito
ratri leni lokamulo nityamu yesuni vèlugulo ll 2 ll
samcharimchutaku... nuvu samtoshimchutaku
nutanamuga janmimchi niti vastramunu dharimchumu... ll ide ll
Credits:Lyrics and Tunes. : K.SatyaVeda Sagar Garu
Singer : Dhanunjay Garu
Music Director : P.Prasanth Garu