Nenu puttakamunupe nannu choochina devudu

నేను పుట్టకమునుపే నన్ను చూచిన దేవుడు



పల్లవి :
నేను పుట్టకమునుపే నన్ను చూచిన దేవుడు
తల్లి గర్భమునందే నన్ను నిర్మించెను చూడు ||2||
ఇది తల్లికి తెలియని నిర్మాణం యెహోవా దేవుని పనితనం
అవయవాలుగా ఉన్న దేహం ఆత్మదేవుని ఆలయం || నేను ||

చ.1

సత్క్రియలను చేయుటకే దేవుడు మనలను పుట్టించెను
దారి తప్పక నడిచుటకే జీవ వాక్యమును అందించెను ||2||
మనకున్న అవయవాలు దేవుడు చేసిన అద్భుతాలు
తండ్రిని ప్రభువుని ఆరాధించగ నీతికి మీరే సాధనాలు ||2|| || నేను ||


చ. 2

దేవుడు చేసిన నా కన్ను ఈ సృష్టిలో ఎంతో గొప్పది
అది జేమ్స్ టెలిస్కోపు నైనా నా చిన్న కన్నుతో చూడాలి ||2||
మమ్మును చేసిన నిన్ను చూడని ఏకన్నైనా గ్రుడ్డిదే
చూచుచున్న అందులని యేసు చెప్పిన మాటకు అర్థమదే ||2|| || నేను ||

చ. 3

పిండములో లేని ఎముకలు ఎదిగి వచ్చుట ఎంతో ఆశ్చర్యం
మెత్తని మాంసపు ముద్దగా గుండె చప్పుడు చేయుట అద్భుతం ||2||

మెత్తని ముద్దగ ఉండె మెదడకు ఎన్నో ఎన్నో ఆలోచనలు
ఊపిరి ఆగిపోయేసరికి జ్ఞానులు అయిన చేరును కాటికి ||2|| ||నేను||

చ. 4

దేవుడు చెప్పిన ఆజ్ఞలను హృదయంలో వ్రాసుకోవాలి
బడిలో నేర్పని వాక్యమును అమ్మ ఒడిలో నేర్చుకోవాలి ||2||

వేకువ ఉదయం మారిన హృదయం మనసుకు ఎంతో ఆనందం
నీతిమంతులు స్తుతి చెల్లించుట దేవునికి ఎంతో సంతోషం ||2|| || నేను||

Nenu puttakamunupe nannu choochina devudu



Pallavi :
Nenu puttakamunupe nannu choochina devudu
talli garbhamunamde nannu nirmimchenu choodu ||2||
idi talliki teliyani nirmaanam yehovaa devuni panitanam
avayavaalugaa unna deham aatmadevuni aalayam || nenu ||

cha.1

satkriyalanu cheyutake devudu manalanu puttimchenu
daari tappaka nadichutake jeeva vaakyamunu amdimchenu ||2||
manakunna avayavaalu devudu chesina adbhutaalu
tamdrini prabhuvuni aaraadhimchaga neetiki meere saadhanaalu ||2|| || nenu ||


cha. 2

devudu chesina naa kannu ee srushtilo emto goppadi
adi jems teliskopu nainaa naa chinna kannuto choodaali ||2||
mammunu chesina ninnu choodani ekannainaa gruddide
choochuchunna amdulani yesu cheppina maataku arthamade ||2|| || nenu ||

cha. 3

pimdamulo leni emukalu edigi vachchuta emto aashcharyam
mettani maamsapu muddagaa gumde chappudu cheyuta adbhutam ||2||

mettani muddaga umde medadaku enno enno aalochanalu
uupiri aagipoyesariki jnyaanulu ayina cherunu kaatiki ||2|| ||nenu||

cha. 4

devudu cheppina aajnyalanu hrudayamlo vraasukovaali
badilo nerpani vaakyamunu amma odilo nerchukovaali ||2||

vekuva udayam maarina hrudayam manasuku emto aanamdam
neetimamtulu stuti chellimchuta devuniki emto samtosham ||2|| || nenu||

Nenu puttakamunupe nannu choochina devudu Video

Credits


Lyrics and Tunes : K.SatyaVeda Sagar Garu
Singer : Maruthi Garu
Music Director : P.Prasanth Garu

More Lyrics

🎵 Browse More Lyrics

Leave a Comment