Jaya sanketamaa dayaa kshetramaa
Pallavi:జయ సంకేతమా దయా క్షేత్రమా
నన్ను పాలించు నా యేసయ్య — 2
అపురూపము నీ ప్రతి తలుపు
అలరించిన ఆత్మీయ గెలుపు — 2
నడిపించే నీ ప్రేమ పిలుపు
//జయ సంకేతమా//
1.
నీ ప్రేమ నాలో ఉదయించగా
నా కొరకు స్వరము సమకూర్చేనే — 2
నన్నెల ప్రేమించ మనసాయెను
నీ మనసెంతో మహోన్నతము
కొంతైనా నీ రుణము తీర్చేదెలా
నీవు లేక క్షణమైన బ్రతికేదెలా
విరిగి నలిగిన మనసుతో నిన్నే
సేవించేద నా యజమానుడా — (2)
జయ సంకేతమా
2.
నిలిచెను నా మదిలో నీ వాక్యమే
నాలోన రూపించే నీ రూపమే — 2
దీపము నాలో వెలిగించగా
నా ఆత్మ దీపము వెలిగించగా
రగిలించే నాలో స్తుతి జ్వాలలు
భజియించి నిన్నే కీర్తింతును
జీవితగమనం స్థాపించితివి
సీయోను చేర నడిపించుమా — (2)
// జయ సంకేతమా //
3.
నీ కృప నాయెడల విస్తారమే
ఏనాడు తలవని భాగ్యమిది — 2
నీ కృప నాకు తోడుండగా
నీ సన్నిధియే నాకు నీడాయెను
ఘనమైన కార్యములు నీవు చేయగా
కొదువేమి లేదాయె నాకెన్నడు
ఆత్మబలముతో నన్ను నడిపించే
నా గొప్ప దేవుడవు నీవేనయ్యా
బహు గొప్ప దేవుడవు నీవేనయ్యా
// జయ సంకేతమా //
Jaya sanketamaa dayaa kshetramaa
Pallavi:Jaya sanketamaa dayaa kshetramaa
nannu paalimchu naa yesayya — 2
apuroopamu nee prati talupu
alarimchina aatmeeya gelupu — 2
nadipimche nee prema pilupu
//jaya sanketamaa//
1.
nee prema naalo udayimchagaa
naa koraku svaramu samakoorchene — 2
nannela premimcha manasaayenu
nee manasemto mahonnatamu
komtainaa nee runamu teerchedelaa
neevu leka kshanamaina bratikedelaa
virigi naligina manasuto ninne
sevimcheda naa yajamaanudaa — (2)
jaya sanketamaa
2.
nilichenu naa madilo nee vaakyame
naalona roopimche nee roopame — 2
deepamu naalo veligimchagaa
naa aatma deepamu veligimchagaa
ragilimche naalo stuti jvaalalu
bhajiyimchi ninne keertimtunu
jeevitagamanam sthaapimchitivi
seeyonu chera nadipimchumaa — (2)
// jaya sanketama//
3.
nee krupa naayedala vistaarame
enaadu talavani bhaagyamidi — 2
nee krupa naaku todumdagaa
nee sannidhiye naaku needaayenu
ghanamaina kaaryamulu neevu cheyagaa
koduvemi ledaaye naakennadu
aatmabalamuto nannu nadipimche
naa goppa devudavu neevenayyaa
bahu goppa devudavu neevenayyaa
// jaya //