Edutivaari tappuletti choopadaaniki

ఎదుటివారి తప్పులెత్తి చూపడానికి



పల్లవి :
ఎదుటివారి తప్పులెత్తి చూపడానికి
అంత తొందరపాటు నీకు దేనికి
తీర్పు తీర్చుచున్న నీవు నేరస్తుడివవుతావు
ఉగ్రత సమకూర్చుకొనెదవు
అ.ప జాలి చూపు యేసు న్యాయవంతుడు
జారిపడినా నిలుపుటకు సమర్ధుడు

1. నీ చూపుడు వేలును ఇతరులవైపెత్తితే
మిగిలియున్న వేళ్ళు నీ వైపు చూపవా
వినయమనసుగలవారమై
ఒకరినొకరు ఘనులనుగా ఎంచవలెనుగా
నిజముగ ప్రేమించువారి తప్పులు కనబడవుగా
ప్రేమ దోషములను కప్పివేయవలెగదా

2. నీ కంటిలో దూలము ఉందని గుర్తించక
పొరుగువాని కంటిలోని నలుసు చూతువా
విశ్వాసపు బలహీనులను
ప్రొత్సహించి ధైర్యపరచి లేపవలెనుగా
దృఢముగా నిలబడియున్నా జారి పడిపోయినా
లెక్క చెప్పవలసినది దేవునికిగదా

3. నీ లాభం కోసము ముందు వెనుక చూడక
సహోదరుని విమర్శించి ఆనందింతువా
విషయమర్థమవకుండనే
అనవసరపు వివరణలు ఇవ్వవలదుగా
ప్రజల మెప్పు పొందగోరి చెడును వ్యాప్తి చేతువా
గాయపరచకుండ మేలు చేయవలెగదా

Edutivaari tappuletti choopadaaniki



Pallavi :
Edutivaari tappuletti choopadaaniki
amta tomdarapaatu neeku deniki
teerpu teerchuchunna neevu nerastudivavutaavu
ugrata samakoorchukonedavu
a.pa jaali choopu yesu nyaayavamtudu
jaaripadinaa niluputaku samardhudu

1. nee choopudu velunu itarulavaipettite
migiliyunna velalau nee vaipu choopavaa
vinayamanasugalavaaramai
okarinokaru ghanulanugaa emchavalenugaa
nijamuga premimchuvaari tappulu kanabadavugaa
prema doshamulanu kappiveyavalegadaa

2. nee kamtilo doolamu umdani gurtimchaka
poruguvaani kamtiloni nalusu chootuvaa
vishvaasapu balaheenulanu
protsahimchi dhairyaparachi lepavalenugaa
drudhamugaa nilabadiyunnaa jaari padipoyinaa
lekka cheppavalasinadi devunikigadaa

3. nee laabham kosamu mumdu venuka choodaka
sahodaruni vimarshimchi aanamdimtuvaa
vishayamarthamavakumdane
anavasarapu vivaranalu ivvavaladugaa
prajala meppu pomdagori chedunu vyaapti chetuvaa
gaayaparachakumda melu cheyavalegadaa

Edutivaari tappuletti choopadaaniki Video

Credits


Lyrics, Tune, Music & Voice : Dr. A.R.Stevenson

More Lyrics

🎵 Browse More Lyrics
yebaduloo-aashimchadu-kshanamaina-nanu-viduvani

Leave a Comment