Amarudavu neevu naayesayyaa aadiyu antamu

అమరుడవు నీవు నాయేసయ్యా



పల్లవి : అమరుడవు నీవు నాయేసయ్యా
ఆదియు అంతము నీవేనయ్యా
ఆదిలోనున్న నీ వాక్యమే
ఆదరించెను శ్రమకొలిమిలో
సొమ్మసిల్లక – సాగిపోదును
సీయోను మార్గములో
స్తోత్రగీతము – ఆలపింతును
నీదివ్య సన్నిధిలో ||అమరుడవు||

1. శక్తికి మించిన సమరములో
నేర్పితివి నాకు నీ చిత్తమే
శిక్షకు కావే శోధనలన్నీ
ఉన్నత కృపతో నను నింపుటకే (2)
ప్రతి విజయము నీకంకితం
నాబ్రతుకే నీ మహిమార్థం
లోకమంతయు – దూరమైనను – ననే చేరదీసెదవు
దేహమంతయు – ధూళియైనను – జీవింపజేసెదవు ||అమరుడవు||

2. వేకువకురిసిన చిరుజల్లులో
నీకృప నాలో ప్రవహించగా
పొందితినెన్నో ఉపకారములు
నవనూతనమే ప్రతిదినము (2)
తీర్చగలనా నీ ఋణమును
మరువగలనా నీ ప్రేమను
కన్నతండ్రిగ – నన్ను కాచి – కన్నీరు తుడిచితివి
కమ్మనైన – ప్రేమ చూపి – కనువిందు చేసితివి ||అమరుడవు||

3. జల్దరు వృక్షమును పోలిన
గుణశీలుడవు నీవేనయ్యా
మరణము గెలిచిన పరిశుద్ధుడవు
పునరుత్థానుడవు నీవయ్యా(2)
జయశీలుడవు నీవేనని
ఆరాధింతును ప్రతి నిత్యము
గుండె గుడిలో – నిండినావు – నీకే ఆరాధన
ఆత్మదీపము – వెలిగించినావు – నీకే ఆరాధన ||అమరుడవు||
||బలి||

అమరుడవు నీవు నాయేసయ్యా



pallavi : Amarudavu neevu naayesayyaa
aadiyu amtamu neevenayyaa
aadilonunna nee vaakyame
aadarimchenu shramakolimilo
sommasillaka – saagipodunu
seeyonu maargamulo
stotrageetamu – aalapimtunu
needivya sannidhilo ||amarudavu||

1. shaktiki mimchina samaramulo
nerpitivi naaku nee chittame
shikshaku kaave shodhanalannee
unnata krupato nanu nimputake (2)
prati vijayamu neekamkitam
naabratuke nee mahimaartham
lokamamtayu – dooramainanu – nane cheradeesedavu
dehamamtayu – dhoolaiyainanu – jeevimpajesedavu ||amarudavu||

2. vekuvakurisina chirujallulo
neekrupa naalo pravahimchagaa
pomditinenno upakaaramulu
navanootaname pratidinamu (2)
teerchagalanaa nee runamunu
maruvagalanaa nee premanu
kannatamdriga – nannu kaachi – kanneeru tudichitivi
kammanaina – prema choopi – kanuvimdu chesitivi ||amarudavu||

3. jaldaru vrukshamunu polina
gunasheeludavu neevenayyaa
maranamu gelichina parishuddhudavu
punarutthaanudavu neevayyaa(2)
jayasheeludavu neevenani
aaraadhimtunu prati nityamu
gumde gudilo – nimdinaavu – neeke aaraadhana
aatmadeepamu – veligimchinaavu – neeke aaraadhana ||amarudavu||

Amarudavu neevu naayesayyaa aadiyu amtamu neevenayyaa Video

Credits

HOSANNA MINISTRIES

More Lyrics

🎵 Browse More Lyrics

Leave a Comment