Atiparishuddhuda Stutinaivedyamu Nike Arpimchi
అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము నీకే అర్పించి కీర్తింతును
నీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగా
జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా //అతి పరిశుద్ధుడా//
సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా
ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే
ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం
నీలోనే దాచావు ఈనాటికై నీ ఋణం తీరదు ఏనాటికి //అతి పరిశుద్ధుడా//
సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని
గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే
కృపవెంబడి కృపపొందగా మారాను మధురముగా నే పొందగా
నాలోన ఏ మంచి చూసావయ్యా నీప్రేమ చూపితివి నా యేసయ్యా //అతి పరిశుద్ధుడా//
సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక
శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక
ఉన్నావులె ప్రతిక్షణమునా కలిసి ఉన్నావులె ప్రతిఅడుగున
నీవెగా యేసయ్యా నా ఊపిరి నీవెగా యేసయ్యా నా కాపరి //అతి పరిశుద్ధుడా//
Atiparishuddhuda Stutinaivedyamu Nike Arpimchi
Atiparishuddhuda Stutinaivedyamu Nike Arpimchi Kirtimtunu
Nivu Na Pakshamai Nanu Divimchaga Nivu Na Toduvai Nanu Nadipimchaga
Jivimtunu Nikosame Ashrayamaina Na Yesayya
Sarvonnatamaina Sthalamulayamdu Ni Mahima Vivarimpaga
Unnatamaina Ni Samkalpamu Ènnadu Ashcharyame
Mumdènnadu Chavichudani Sarikròttadaina Premamrritam
Nilone Dachavu Inatikai Ni Rrinam Tiradu Enatiki
Sadgunarashi Ni Jadalanu Na Yèduta Numchukòni
Gadichina Kalam Sagina Payanam Ni Krripaku Samketame
Krripavèmbadi Krripapòmdaga Maranu Madhuramuga Ne Pòmdaga
Nalona E Mamchi Chusavayya Niprema Chupitivi Na Yesayya
Sarèpainunna Patraga Nannu Chejariponivvaka
Shodhanalènno Èdirimchinanu Nanu Soliponivvaka
Unnavulè Pratikshanamuna Kalisi Unnavulè Pratiaduguna
Nivèga Yesayya Na Upiri Nivèga Yesayya Na Kapari
Credits: HOSANNA MINISTRIES